బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు భూసేకరణ వివరాలు వెంటనే సమర్పించాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ జిల్లా: బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు సేకరించిన భూమి, చెల్లింపులు, పెండింగ్ భూసేకరణ తదితర సమగ్ర వివరాలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లేముల రిజర్వాయర్‌, పంపు హౌస్‌లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా రిజర్వాయర్ వద్దకు చేరుకున్న కలెక్టర్, బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టు ద్వారా అందిస్తున్న సాగునీరు, ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, భూసేకరణకు ఇప్పటి వరకు చేసిన చెల్లింపుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ బద్రు, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి...