ఆయుష్ లో పరిశుభ్రత పచ్చదనం

నల్లగొండ : ప్రభుత్వ ఆయుష్ డిపార్ట్మెంట్లో బుధవారం ఆయుర్వేదం,హోమియో, యూనాని ఆద్వర్యంలో పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. యునాని, ఆయుష్, ఆయుర్వేదిక్‌ సెంటర్‌ ప్రాంతాలలో పిచ్చి మొక్కలను తొలగించారు. చెత్తా చెదారం తీసివేసి శుభ్ర పరిచారు. అనంతరం ఆయా విభాగాల ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపర్డెంట్ నరసింహారావు,సీనియర్ మెడికల్ ఆఫీసర్ సుహాసిని మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించడం ద్వార రోగులకు ఆరోగ్యం,ఆహ్లాదం అందించవచ్చన్నారు. నాటిన మొక్కను సంరక్షించాల్సిన బాద్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్‌ డిపార్టుమెంట్‌ డీపీఎం కె. కళ్యాణ్, డాక్టర్‌ రుచిత , వైద్య సిబ్బంది...