పెండింగ్ రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశాలు రెవెన్యూ అధికారులు అంకితభావంతో, చిత్తశుద్ధితో పనిచేసి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ భారతి, భూ రికార్డులు, భూమి వివాదాలు, రెవెన్యూ సదస్సుల్లో సాదా బైనామాలపై వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలంలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను క్రమం తప్పకుండా సమీక్షించాలని, భూ సంబంధిత వ్యవహారాలలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అసైన్డ్ భూములకు...