వైకుంఠ ఏకాదశి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించాల్సిందిగా ఆలయ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో పాటు ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి అధికారికంగా ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్టలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ఉత్సవాల వివరాలను కూడా ముఖ్యమంత్రికి తెలియజేశారు.