రాష్ట్రపతి నిలయంలో జరిగిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోం’ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.