హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – హిస్ఎఫ్‌ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లో నిర్వహించిన హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ – హిస్ఎఫ్‌ఎఫ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌కు, తెలంగాణకు ఈ ఫెస్టివల్ ఒక మంచి ఆరంభమని అన్నారు. యువ ఫిల్మ్‌మేకర్స్‌కు షార్ట్ ఫిల్మ్స్ స్వేచ్ఛను, సృజనాత్మకతను ఇస్తాయని, కొత్త ఆలోచనలు వెలుగులోకి రావడానికి ఇలాంటి వేదికలు అవసరమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. మంచి ప్రతిభకు అవకాశాలు కల్పించడం, యువ ఫిల్మ్‌మేకర్స్‌కు సరైన వేదికలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే...