➤ “రైతులకు భరోసా – ప్రతి గింజకు మద్దతు ధర కల్పిస్తాం”
— ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చందంపేట మండలం పోలేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS) ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని నేడు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ— “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన రైతు భరోసా కింద, ప్రతి ధాన్యం గింజకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది వరి దిగుబడి బాగున్నందున రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.” అలాగే— నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు....