వరంగల్‌కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కొండా సురేఖ.. ఘన స్వాగతం
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ పర్యటన సందర్భంగా బుధవారం వరంగల్ ఎన్ఐటీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం, మంత్రికి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అలాగే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, హనుమకొండ, వరంగల్...