ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారి సేవలు, త్యాగాలకు తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ కోరారు. మంగళవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ అమరజ్యోతి వద్ద తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై ఉద్యమ గుర్తింపు కమిటీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తల ప్రసారానికే పరిమితం కాకుండా ప్రజల ఆకాంక్షలు, ఆవేదన, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమానికి నైతిక బలం చేకూర్చారని పేర్కొన్నారు....