నకిరేకల్‌లో ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ.. 8 వేల మంది మహిళలకు అందజేత

నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని 01, 07, 08, 09, 10, 11 వార్డులకు చెందిన మహిళలకు ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద చీరలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. నకిరేకల్ పట్టణంలో 8 వేల మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల...