ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్ట్స్ కళాశాల వద్ద ఘన స్వాగతం
చీకటి-వెలుగు, అక్టోబర్ 31 — వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేము నరేందర్ రెడ్డి ఉన్నారు. వారిని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, వరంగల్ ఎంపీ డాక్టర్...