డా. బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్
కంది సాయి తేజ,చీకటి వెలుగు: హైదరాబాద్, అక్టోబర్ 31: మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని డా. బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్ పాలసీ అంశాలపై ఇద్దరు మంత్రుల మధ్య విస్తృత చర్చ జరిగింది. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని...