జీడబ్ల్యూఎంసీ నూతన కమిషనర్‌కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన టి. వెంకన్న సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ టి. వెంకన్న కలెక్టర్‌కు పూలమొక్కను అందజేయగా, కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నగరాభివృద్ధి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ఇద్దరూ చర్చించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే దిశగా సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించినట్లు తెలిసింది.