జర్నలిస్టులకు ఊరట.. బస్‌పాస్ గడువు పెంపు, కొత్తవాటికి ఆన్‌లైన్ దరఖాస్తులు

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు రవాణా సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2026-2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, కొత్తగా అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులకు రాయితీ బస్‌పాస్‌ల మంజూరు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యానికి సూచనలు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 17, 2026 నుంచి ఏప్రిల్ 30, 2028 వరకు చెల్లుబాటు అయ్యే బస్‌పాస్‌లను జారీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే, ఇంకా కొత్త అక్రిడిటేషన్ కార్డులు అందని జర్నలిస్టులకు ఊరటనిస్తూ ప్రస్తుతం వినియోగిస్తున్న పాత బస్‌పాస్‌ల గడువును జూన్ 17 నుంచి 30వ...