అసోంలో ఎయిర్ ఫోర్స్ AN-32 విమానం కుప్పకూలింది

అసోంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద భారత వైమానిక దళానికి చెందిన AN-32 రవాణా విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రక్షణ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అనే విషయాలపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.