పర్యావరణ పరిరక్షణపై అవగాహన సభ.. హరిత పాఠశాలలే లక్ష్యం: కలెక్టర్ సత్య శారద
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో “పర్యావరణ పరిరక్షణ – ప్లాస్టిక్ వాడకం నివారణ” అంశంపై అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, చిన్నతనం నుంచే పిల్లల్లో చెట్లు నాటడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, కాలుష్య ప్రభావాలపై అవగాహన కల్పించడం అవసరమని...