నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వార్తలు అవాస్తవం.. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దు: NTA హెచ్చరిక

నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందస్తుగా అందుబాటులో ఉందని లేదా విక్రయిస్తున్నారని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో జరుగుతున్న ప్రచారాన్ని జాతీయ పరీక్షల సంస్థ (NTA) ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎన్‌టీఏ, ఇలాంటి సమాచారం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేసింది. విద్యార్థులు, వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న మోసగాళ్ల ముఠాలే ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని పేర్కొంది. అభ్యర్థులు తప్పుడు వార్తలను నమ్మకుండా అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని, అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించింది.