భారత్-రష్యా బంధం బలంగా ఉంది.. పాశ్చాత్య ఒత్తిళ్లు ఫలించవు: పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌తో మాస్కోకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ ప్రముఖ వార్తా సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, రష్యాతో సహకారాన్ని తగ్గించాలని భారత్‌పై పాశ్చాత్య దేశాలు చేస్తున్న ఒత్తిళ్లు ఫలించవని, అలాంటి ప్రయత్నాలు ప్రపంచ స్థిరత్వానికి హానికరమని అన్నారు. భారత్ ఆర్థికాభివృద్ధిని ప్రశంసించిన పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోందని, న్యూఢిల్లీతో ఆర్థిక సహకారాన్ని మరింత విస్తరించేందుకు రష్యా కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే అమెరికాతో భారత్‌కు ఉన్న దౌత్య సంబంధాలు...