సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ వ్యాఖ్యలు.. సూపర్ స్టార్‌పై జాన్వీ ఫన్నీ కామెంట్స్
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడిన ఆమె, “ఆయన అసలు వయసు పెరగరు.. నాకంటే కూడా యంగ్‌గా కనిపిస్తారు” అంటూ ప్రశంసించారు. మహేష్ బాబు ఫిట్నెస్, లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌పై ఇప్పటికే అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఇప్పుడు జాన్వీ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్‌పై మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ పోస్టులు షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ దక్షిణాది సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే.