బ్లింకిట్‌లో వైరల్ అవుతున్న ‘బొద్దింకల పార్టీ’.. ఆన్‌లైన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బొద్దింకల ప్రచారం
ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌లో కనిపించిన “బొద్దింకల పార్టీ” క్యాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ యాప్‌లో ప్రచార తరహాలో కనిపించిన ఈ పోస్టర్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. “బొద్దింకల పార్టీ అస్సలు తగ్గట్లేదుగా” అంటూ మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. రాజకీయ ప్రచారాలను పోలిన ఈ క్రియేటివ్ క్యాంపెయిన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇది అసలు ప్రమోషనల్ క్యాంపెయినా? లేక సోషల్ మీడియా సెటైరా? అన్నదానిపై కూడా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో నిలిచాయి.