విజయ్ కేబినెట్లో ఇద్దరు కొత్త మంత్రులు.. టీవీకే ప్రభుత్వంలో కొత్త ముఖాలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌ను విస్తరించారు. కూటమి భాగస్వామ్య పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ వీీసీకే (VCK), ఐయూఎంఎల్ (IUML) పార్టీలకు చెరొక మంత్రి పదవిని కేటాయించారు. ఈ నిర్ణయంతో కూటమి సమీకరణాలకు మరింత బలం చేకూరనున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా ఎంపికైన మంత్రుల ప్రమాణ స్వీకారం త్వరలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.