పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు… సామాన్యుడిపై మరో భారం
దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెరిగిన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29 పెంచగా, తాజా ధర రూ.112.50కు చేరింది. అలాగే డీజిల్‌పై లీటరుకు రూ.3.15 పెంపుతో ధర రూ.100.22గా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ ఉద్రిక్తతల ప్రభావంతో ఈ ధరల పెంపు జరిగినట్లు సమాచారం. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.