నల్గొండ జనరల్ ఆసుపత్రిలో నర్సుల దినోత్సవ వేడుకలు
నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ, నర్సింగ్ అధికారులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సులు అందించే సేవలు ఎంతో గొప్పవని, ప్రాణాలను కాపాడడంలో వారి పాత్ర కీలకమని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేసిన సేవలకు గుర్తుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. నేటి తరం...