వరంగల్‌లో ఉగాది డైరీ ఆవిష్కరణ.. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా విడుదల

వరంగల్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) యూనిట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా రూపొందించిన “ఉగాది పరాభవనామ సంవత్సరం” డైరీని మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలుగు సంవత్సరానికి అనుగుణంగా డైరీ రూపొందించడం అభినందనీయమని తెలిపారు. వరంగల్ ఐజేయూ యూనియన్ తీసుకున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రామచందర్, ప్రధాన కార్యదర్శి మట్టా దుర్గాప్రసాద్ మరియు సభ్యులు పాల్గొన్నారు.