బెంగాల్ ఎన్నికల తొలి దశ ఓటర్ల గణాంకాలు విడుదల

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశకు సంబంధించిన ఓటర్ల వివరాలను భారత ఎన్నికల సంఘం (ECI) విడుదల చేసింది. ఈ దశలో మొత్తం 3,60,77,171 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 1,84,99,496 మంది పురుషులు, 1,75,77,210 మంది మహిళలు, అలాగే 465 మంది తృతీయ లింగ ఓటర్లు ఉన్నారు. ఈ గణాంకాలు ప్రాథమికంగా విడుదల చేయగా, ట్రిబ్యునల్ ధృవీకరణ అనంతరం తుది ఓటర్ల జాబితాను నవీకరించనున్నట్లు ఈసీఐ తెలిపింది.