మే 3న నల్గొండ ప్రోమో రన్… ప్రజలకు ఎస్పీ పిలుపు
సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో మే 3న నల్గొండలో ప్రోమో రన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. “రన్ ఫర్ తెలంగాణ – ఫిట్ ఫర్ తెలంగాణ”, “రన్ ఫర్ నల్గొండ – ఫిట్ ఫర్ నల్గొండ” అనే ద్యేయంతో 2K, 5K, 10K రన్స్ నిర్వహించబడనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో రన్నింగ్ కల్చర్ అభివృద్ధి చెందడంతో పాటు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడతారని ఎస్పీ తెలిపారు. తాను కూడా ఈ రన్లో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో రన్ పోస్టర్ను...