బచన్నపేట ఎస్ఐపై బదిలీ వేటు… అవినీతి ఆరోపణలపై చర్యలు
జనగామ జిల్లా బచన్నపేట ఎస్ఐపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఎస్ఐను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో విచారణ ప్రారంభించిన అధికారులు, తక్షణ చర్యగా బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన పోలీసు విభాగంలో చర్చనీయాంశంగా మారింది.