మహారాష్ట్రలో 4.7 తీవ్రత భూకంపం

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఈరోజు ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావం హింగోలి మాత్రమే కాకుండా సమీప నాందేడ్, పర్భణి జిల్లాల్లో కూడా కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపానికి కేంద్రబిందువు హింగోలి జిల్లా వస్మత్ తాలూకాలోని శిర్లీ గ్రామం సమీపంలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.