నల్లగొండలో హిందూ సమ్మేళనం ఘనంగా

నల్లగొండ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దింటకుర్తి నారాయణ స్వామీజీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి కులం ఉన్నప్పటికీ అందరూ హిందువులుగా కలిసిమెలిసి జీవించాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథి మేడిపల్లి యాదన్ కుమార్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు సమస్యలు వస్తే అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. మహిళా వక్త కళ్లెం స్వప్న కుటుంబ విలువలు, సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు. ముఖ్య వక్త అప్పల ప్రసాద్ మాట్లాడుతూ కులాలు గడపలోపల మాత్రమే ఉండాలని, బయట మనమందరం హిందువులుగా ఉండాలని అన్నారు. పిల్లలకు...