నల్లగొండలో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభం మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్లగొండ జిల్లా మాన్యంచల్కలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన, సమయానుకూల వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనం ద్వారా పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. జిల్లా జైలుకు సంబంధించిన స్థలాన్ని సమన్వయం చేసి ఈ ఆసుపత్రి నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో అవసరమైన...