CA ఇంటర్ పరీక్షలు రీషెడ్యూల్
చార్టర్డ్ అకౌంటెన్సీ (CA) ఇంటర్ పరీక్షలను ఐసీఏఐ (ICAI) రీషెడ్యూల్ చేసింది. ముందుగా మే 3న ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఇప్పుడు మే 5 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్-1 పరీక్షలు మే 5, 7, 9 తేదీల్లో నిర్వహించబడతాయి. గ్రూప్-2 పరీక్షలు మే 11, 13, 15 తేదీల్లో జరుగుతాయి. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అయితే ఫౌండేషన్ మరియు ఫైనల్ పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవని ఐసీఏఐ స్పష్టం చేసింది. అలాగే ఫైనల్ పరీక్షలను ఇకపై ప్రతి సంవత్సరం రెండు సార్లు, మే మరియు నవంబర్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది.