ఎస్‌ఎస్‌సి మూల్యాంకన బకాయిల చెల్లింపుకు డిమాండ్
నల్లగొండ జిల్లాలో గత సంవత్సరం ఎస్‌ఎస్‌సి స్పాట్ వాల్యుయేషన్‌లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లోని స్పాట్ మూల్యాంకన కేంద్రంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి బి. భిక్షపతికు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, గత సంవత్సరం ఏప్రిల్‌లో నిర్వహించిన మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్, టీఏ, డీఏలు ఇప్పటికీ చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన పరీక్షలు పూర్తవుతున్నప్పటికీ, గత బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఉపాధ్యాయుల్లో నిరుత్సాహం నెలకొన్నట్లు తెలిపారు. వెంటనే...