నల్గొండలో “రన్ ఫర్ జీసస్” కార్యక్రమం… ఐక్యతకు నాంది పలికిన బిషప్
నల్గొండ జిల్లా కేంద్రంలో శనివారం “రన్ ఫర్ జీసస్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్సీఎం చర్చ్ నల్గొండ డయాసిస్ బిషప్ కర్ణం ధమన్ కుమార్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రజల ఐక్యతకు నాంది పలుకుతుందని తెలిపారు. ఐక్యత లేకపోతే ఏది సాధించలేమని, ప్రజలందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రజల్ని రక్షించడానికి దేవుడు ముందుకు వచ్చాడని, అదే మానవత్వాన్ని మనమూ అనుసరించాలన్నారు. కులాలు, మతాలతో సంబంధం లేకుండా మానవత్వమే ప్రధానమని, “మానవసేవే మాధవసేవ” అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో...