శీతల అష్టమి ఆలయంలో విషాదం…. తొక్కిసలాటలో 8 మహిళల మృతి

బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో శీతల అష్టమి సందర్భంగా ఘోర విషాదం చోటుచేసుకుంది. శీతల మాత ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. చైత్ర మాసం చివరి మంగళవారం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా చద్దన్నం ప్రసాదం సమర్పించేందుకు భక్తులు ఒక్కసారిగా ఎగబడడంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. ఆలయం లోపల స్థలం తక్కువగా ఉండటం, భక్తుల అధిక రద్దీ, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ఈ ప్రమాదానికి కారణాలుగా భావిస్తున్నారు. తొక్కిసలాటలో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీయగా, ఒకరిపై ఒకరు పడిపోవడంతో పరిస్థితి విషమించింది. గాయపడిన వారిని ఆసుపత్రులకు...