రహదారి భద్రతపై కట్టుదిట్ట చర్యలు

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో రహదారి భద్రత చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని రహదారులు, బ్లాక్ స్పాట్లు, ప్రమాదాలు, మరణాల వివరాలను పోలీసు శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా చేపడుతున్న “సురక్షితంగా చేరుకోండి” కార్యక్రమాన్ని ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభల...