విద్యా కమిషన్ సిఫారసుల అమలుకు డిమాండ్…. సమాన విద్య, సామాజిక న్యాయం కోసం సదస్సు

అఖిల భారత్ బాలల హక్కుల పరిరక్షణ వేదిక (CRPF) ఆధ్వర్యంలో “సమాన విద్య, సామాజిక న్యాయం కోసం” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సిఫారసులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసన మండలి సభ్యుడు అల్గుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ, విద్యా కమిషన్ చేసిన సిఫారసులు స్వాగతించదగ్గవని, ప్రభుత్వం వాటిని ఆమోదించి వెంటనే అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉండటం, విద్యా ప్రమాణాలు దిగజారుతున్న నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన...