వందే భారత్ పెరుగులో పురుగులు…. కలకలం 50 లక్షల జరిమానా విధింపు
వందే భారత్ ట్రైన్లో ప్రయాణికులకు అందించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై సంబంధిత సంస్థపై రూ.50 లక్షల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తి సంస్థ అముల్ స్పందించింది. తమ ఉత్పత్తిలో ఎలాంటి లోపం లేదని, తయారీ సమయంలో అన్ని నాణ్యత ప్రమాణాలను పాటించామని పేర్కొంది. ఈ సమస్య సరఫరా లేదా నిల్వ ప్రక్రియలో జరిగిన తప్పిదం కావచ్చని అముల్ వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి, పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యతపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.