టీజీక్యాబ్ 2026-27 బడ్జెట్‌కు ఆమోదం
తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ (TGCAB) 26వ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశానికి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు బ్యాంకు పర్సనల్ ఇన్‌చార్జ్ సురేంద్ర మోహన్, ఐఏఎస్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCBs) పర్సనల్ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ మరియు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పర్సనల్ ఇన్‌చార్జ్ చాహత్ బాజ్ పాయ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. అదేవిధంగా బ్యాంకు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అమలు చేస్తున్న అభివృద్ధి...