గీసుకొండలో గాలికుంటు టీకాల కార్యక్రమం
ప్రజా పాలన–పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గీసుకొండ మండలం దసరు తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. జాతీయ గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ప్రారంభించారు. గాలికుంటు వ్యాధి నివారణ కోసం ప్రచార రథాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పశువులకు టీకాలు వేయడం, నట్టల నివారణ చర్యలు చేపట్టడం, పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పశుపోషకులను ఈ కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాలకృష్ణ, సర్పంచ్ అమృత, డాక్టర్లు శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, రాధిక, సిబ్బంది, గోపాల...