రైతు సమస్యలపై కలెక్టర్కు మెమోరాండం
నల్లగొండ జిల్లాలో రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకట్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ నెలలోనే ఐకేపీ (IKP) సెంటర్లు ప్రారంభించాలని, రైతులకు ఇవ్వాల్సిన బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే విబిజి రామ్జీ పథకాన్ని...