ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాలపై 20% వరకు డిస్కౌంట్
తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై 10-20 శాతం వరకు డిస్కౌంట్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. సెక్రటేరియట్లో నిర్వహించిన కార్యక్రమంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఈవీ కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు అందించేందుకు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు. తెలంగాణ ఈవీ పాలసీ కింద రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్‌పై 100% మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత...