క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కుల (SC) హోదాను కొనసాగించలేరని స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని కోర్టు గుర్తుచేసింది. ఈ కేసు చింతడ ఆనంద్ అనే పాస్టర్‌కు సంబంధించినది. ఆయన క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఇవ్వాలని కోరారు. అయితే ఆయన బహిరంగంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ,...