మంగళూరు పోర్టుకు చేరిన అమెరికా LPG షిప్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన సమస్యలకు క్రమంగా ఊరట లభిస్తోంది. తాజాగా అమెరికా నుంచి భారీ ఎల్పీజీ సరుకు తీసుకువచ్చిన ఓ నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరింది. ఈ నౌక సుమారు 16,000 టన్నులకుపైగా ఎల్పీజీని తీసుకువచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో మరిన్ని నౌకలు కూడా భారత్కు రానుండటంతో సరఫరా పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఈ నౌక రాక భారత్కు పెద్ద ఊరటగా భావిస్తున్నారు. ఇంధన సరఫరాలను నిర్ధారించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముడి చమురు, ఎల్పీజీపై కార్గో...