పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గుత్తా

నల్గొండ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) పథకం కింద 48 మంది లబ్ధిదారులకు రూ.19,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు ఎంతో ఉపయోగకరమైనదని, ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందుతోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని గుత్తా...