‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ దుమారం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో అన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. ఓపెనింగ్ నుంచే రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేస్తూ సినిమా సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. యాక్షన్, ఎమోషన్, విజువల్స్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వీకెండ్‌లో థియేటర్లు హౌస్‌ఫుల్‌గా నడవడంతో కలెక్షన్లు మరింత పెరిగాయి. సినిమా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ చిత్రం త్వరలోనే మరిన్ని రికార్డులు సృష్టించే...