ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం
పరాభవనామ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా నల్గొండ పట్టణంలోని గాంధీ పార్క్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితులు నాగరాజు శర్మ చేత పంచాంగ శ్రవణం జరిపించారు. రాబోయే సంవత్సరంలో దేశం, రాష్ట్రంలో జరిగే పరిణామాలు, శుభాశుభ సూచనలు వివరించారు. అలాగే వివిధ రాశుల వారికి సంబంధించిన రాశిఫలాలను వివరంగా వినిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, సభ్యులు ఆసక్తిగా శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా కార్యదర్శి లక్ష్మిశెట్టి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు యమ మురళీధర్, సంఘం నాయకులు వీరెల్లి సతీష్, నాంపల్లి నరసింహ, లకుమారపు శ్రీనివాస్, యామ...