నల్గొండ 8వ డివిజన్లో ఆలయ శంకుస్థాపన
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ ద్వారకా నగర్ కాలనీలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి ఆలయాలకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో పట్టణ ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 8వ డివిజన్ అభివృద్ధి విషయంపై మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, వృద్ధాప్య పింఛన్లు, సీసీ రోడ్లు, వీధి దీపాలు వంటి పలు పనులను మున్సిపాలిటీ నిధులతో, మంత్రి సహకారంతో పూర్తి చేస్తామని హామీ...