వర్ధంతి సందర్భంగా ఉచిత మోకాలి మార్పిడి శస్త్రచికిత్స

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీర వనిత మల్లు స్వరాజ్యం జీవితం అందరికీ ఆదర్శనీయమని ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య పేర్కొన్నారు. ఆమె 4వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం మనవడు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ మల్లు అరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో సత్యవతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో సూర్యాపేట జిల్లాకు చెందిన నిరుపేద జుట్టుకొండ వీరయ్యకు ఉచిత మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ముందుగా మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీనయ్య మాట్లాడుతూ స్వరాజ్యం జీవితం త్యాగాలకు ప్రతీక...