వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఎన్నిక

ఈరోజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా నూతన కమిటీని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీనివాసులు అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం, రాష్ట్ర అధ్యక్షుడు కార్ల జంగయ్య పాల్గొన్నారు. సమావేశంలో కొమ్ము హరికుమార్‌ను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గడ్డం కాసిం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. బడ్జెట్‌లో వికలాంగుల పెన్షన్‌ను పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ సభ్యులు జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేసి వికలాంగుల సమస్యలపై సుదీర్ఘ పోరాటం చేయాలని సూచించారు. త్వరలో గ్రామ, మండల...