మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ
మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మరియు తెలంగాణ మైనారిటీస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద 56 మంది మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 40 రోజులపాటు కుట్టుమిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 100 శాతం సబ్సిడీతో మిషన్లు అందజేశారు. ఒక్కో మిషన్ విలువ సుమారు రూ.10,000 కాగా, ఎలక్ట్రికల్ మిషన్లు కూడా పంపిణీ చేశారు. మిగిలిన లబ్ధిదారులకు విడతలవారీగా మిషన్లు అందజేస్తామని అధికారులు తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి...